ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా యుఎస్ బాక్సాఫీస్ వద్ద, అతని సినిమాలు సంవత్సరాల తరబడి నిరంతరాయంగా మంచి వసూళ్లను సాధిస్తూనే ఉన్నాయి. అయితే నిన్న విడుదలైన ‘సర్కారు వారి పాట’ ఓవర్సీస్ ప్రీమియర్‌లో $600 వేలు వసూలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఏకంగా $922 వేలు వసూలయ్యాయి. RRR తరువాత ఈ మేర ప్రీమియర్ కలెక్షన్లు సాధించిన మూవీగా SVP నిలిచింది. దీంతో ఓవర్సీస్‌లో మరోసారి మహేష్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.