దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఓ శాటిలైట్ రూపొందించనున్నారు. ఈ మేరకు బెంగళూరు మల్లేశ్వరంలోని పీయూ కళాశాలలో నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని కర్ణాటక ఐటీబీటీ శాఖ మంత్రి అశ్వత్థనారాయణ సోమవారం శ్రీకారం చుట్టారు. 50 కిలోల బరువుతో, రూ.50 నుంచి రూ.60 కోట్లతో ఈ శాటిలైట్‌ను నిర్మించనుండగా.. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఈ శాటిలైట్‌ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి 20 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొననుండగా.. ఆయన స్మారకార్థంగా అతనికి ఇది చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి పేర్కొన్నారు.