శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సిరుత్తై సినిమా ఓటీటీ, శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తికాకముందే వంద కోట్లకు రైట్స్ తీసుకున్నారని సమాచారం. దక్షిణాది చిత్రాలు హిట్ అవుతుండటంతో జయంతి లాల్ కొనుగోలు చేశారని టాక్. పీరియాడికల్ జోనర్ సినిమా తెరకెక్కుతుండగా సూర్య 12 గెటప్స్‌లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. సూర్యకు జోడిగా దిశా పటానీ నటిస్తోంది. పాన్ వరల్డ్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు. త్రీడీలో షూట్ చేస్తున్నారు.