శనివారం కూడా పాస్‌పోర్ట్ కేంద్రాలు ఓపెన్

© ANI Photo

విదేశాలకు వెళ్లాలనుకునేవారికి హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై శనివారం కూడా కార్యాలయం తెరిచి ఉంటుందని వెల్లడించింది. ఇప్పటి వరకు పాస్‌పోర్ట్ ఆఫీస్ వారంలో ఐదురోజులు మాత్రమే పనిచేసేది. ప్రజల విజ్ఞప్తి మేరకు శనివారం కూడా సేవలు అందించనున్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌లోని పాస్‌పోర్ట్ కేంద్రాలతో పాటు కరీంనగర్, నిజామాబాద్ కేంద్రాలు కూడా శనివారం పనిచేస్తాయని వివరించింది.

Exit mobile version