ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కొత్తగా ఇంధన పొదుపు ప్రణాళికలను ప్రకటించారు. ఇందులో భాగంగా రాత్రి 8.30 గం.లకే మార్కెట్లు, 10 గంటలకు వివాహ వేదికలను మూసివేయనున్నారు. దీనివల్ల 60 బిలియన్ల పాకిస్థానీ రూపాయలు ఆదా అవుతాయట. ఫిబ్రవరి నుంచి సాధారణ బల్బులు… జులై నుంచి నాసిరకం ఫ్యాన్ల ఉత్పత్తి నిలిపివేసి మరో 37 బిలియన్లు ఆదా చేయనున్నారు. ప్రభుత్వ భవనాల్లో విద్యుత్‌ను 30 శాతం ఆదా చేసేందుకు యోచిస్తున్నారు.