తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి పదోన్నతులు, బదిలీల ప్రక్రియను చేపట్టనుంది. అందుకు సంబంధించి 28 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 4వ తేదీ నాటికి ప్రక్రియను పూర్తి చేస్తారు. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించారు. ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరిస్తారు.