మూడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. కేరళ(త్రిక్కకర), ఉత్తరాఖండ్(చంపావత్), ఒడిశా(బ్రజరాజ్ నగర్) రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మూడు అసెంబ్లీ స్థానాలకు ఈనెల 31న ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. నామినేషన్ దాఖలుకు ఈనెల 11 చివరి తేదీ కాగా, ఉపసంహరణకు మే 16 వరకు అవకాశం కల్పించారు. 31 ఎన్నికలు నిర్వహించి జూన్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు.