SSC,ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపున‌కు షెడ్యూల్‌

తెలంగాణ‌లో మే/జూన్ నెలల్లో SSC, ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించనున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ప‌రీక్ష‌ల‌కు ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 8 నుండి 18 వరకు అభ్యర్థులు ప‌రీక్ష ఫీజు చెల్లించ‌వ‌చ్చు. రూ. 25ల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 19 నుంచి 25 వ‌ర‌కు, రూ.50 రుసుముతో ఏప్రిల్ 26 నుంచి 30 వ‌ర‌కు చెల్లించాలి. TS ఆన్‌లైన్/మీ-సేవా కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలి. చలాన్ లేదా డిడి ద్వారా చెల్లింపు ఆమోదించబోమ‌ని TOSS డైరెక్టర్ ఎం.సోమి రెడ్డి తెలిపారు.

Exit mobile version