హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ సైయెంట్, పోర్చుగల్‌కు చెందిన వైర్‌లెస్ ఇంజనీరింగ్ సేవల సంస్థ సెల్ఫినెట్‌ను 41 మిలియన్ యూరోలకు (సుమారు రూ. 340 కోట్లు) కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ మొత్తాన్ని రెండు దఫాలుగా చెల్లించనున్న సైయెంట్, మొదటి దఫాలో 65 శాతం, రెండో దఫాలో 35 శాతం చెల్లించనుంది. ఈ కంపెనీ కొనుగోలు ద్వారా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లు, ఎంటర్‌ప్రైజెస్ నెట్‌వర్క్ స్కేల్‌ను బలోపితం చేయనుంది.