ఈజిప్ట్ కళాఖండాలను పురావస్తు శాస్త్రవేత్తలు మొదటి సరి బహిర్గతం చేశారు. తాజాగా నిర్వహించిన తవ్వకాల్లో 2,500 ఏళ్లనాటి 250 మమ్మీల శవ పేటికలు, కళాఖండాలు వెలికి తీశారు. వీటిలో అనుబిస్, అమున్, మిన్, ఒసిరీన్, ఐసిస్, నెఫెర్టం, బాస్టెట్, హాథోర్ దేవతల విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ పేటికలను, కళాఖండాలను స్వాధీనం చేసుకున్న ఈజిప్టు పర్యాటక, పురాతన మంత్రిత్వ శాఖ.. న్యూ గ్రాండ్ ఈజిప్సియన్ మ్యూజియంకు తరలించనున్నారు.