పాకిస్థాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. గోధుమ పిండి కోసం బలూచిస్థాన్, సింధ్ ప్రావిన్సులలో తొక్కిసలాట జరుగుతుండటం ఇందుకు నిదర్శనం. ఇటీవల సింధ్ ప్రావిన్సులో జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి చెందడం గమనార్హం. గోధుమలు, పిండి ధరలు కిలోకు రూ.150వరకు పెరిగాయి. పాక్ చరిత్రలోనే ఈ స్థాయిలో ధరలు పెరిగిపోవడం తొలిసారి. మరోవైపు, పాకిస్థాన్ వద్ద విదేశీ మారక నిల్వలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కేవలం 3 వారాల దిగుమతులకు మాత్రమే సరిపడా నిల్వలు ఉన్నాయని ఆ దేశ సెంట్రల్ బ్యాంకు వెల్లడించింది. పాకిస్థాన్ దివాళా తీయనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట.