ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో పలు సంస్థలు ఐపీవోకు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎల్ఐసీ(భారతీయ జీవిత భీమా సంస్థ) ఐపీవోకు సెబీ ఆమోదం తెలిపింది. ఇక ప్రభుత్వం ఐపీవో తేదీనే ఖరారు చేయడమే మిగిలి ఉండగా.. ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరంలోనే ఈ ఐపీవోను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా మార్కెట్లు పతనమవుతున్నాయి. దీంతో ఎల్ఐసీ ఎప్పుడు తీసుకురావాలా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.