క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చింది. శ్రుతి హాసన్ ఇప్పటికే మొదటి కథానాయికగా ఫైనల్ కాగా, హనీ రోజ్ వర్గీస్‌ను రెండో హీరోయిన్ గా ఎంచుకున్నట్లు తెలిసింది. గతంలో తెలుగులో ఆలయం మూవీలో శివాజీ సరసన ఈ నటి యాక్ట్ చేసింది. తర్వాత మలయాళంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం NBK107 టీమ్ మూవీకి ‘అన్నగారు’ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.