మొదటి వన్డేలో గెలుపు అంచుల దాకా వెళ్లి అనూహ్యంగా ఓటమిని చవిచూసిన టీమిండియా రెండో వన్డేకు సిద్ధమవుతోంది. రేపే ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. తొలి వన్డే స్ఫూర్తితో ఈ మ్యాచ్‌లోనూ పట్టు బిగించాలని ఆతిథ్య బంగ్లాదేశ్ ఉవ్విల్లూరుతోంది. గాయం నుంచి కోలుకొని విజయంతో పుంజుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ మేరకు టీంలో పలు మార్పులు జరిగే అవకాశం ఉంది. మొదటి వన్డేలో స్పిన్నర్లకు పిచ్ సహకరించడంతో.. ఈ వన్డేకు స్పిన్నర్లను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఫిట్‌నెస్ సాధిస్తే అక్షర్ పటేల్ జట్టులోకి వస్తుండొచ్చు. ఇక టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.