తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమా నుంచి ఈ రోజు మూవీ యూనిట్ సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన అరబిక్ కుతు పాట యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ నుంచి ఈ రోజు జాలి ఓ జిమ్ఖానా అంటూ సాగే పాట విజయ్ అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కరినీ ఈ పాట ఆకట్టుకుంటోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.