వ్యభిచార ముఠాలు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అతి తెలివిని ప్రదర్శిస్తున్నాయి. వివరాల ప్రకారం.. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ హోటల్ అడ్డాగా వ్యభిచారం సాగుతుందని పోలీసులు పక్కా సమాచారంతో రైడ్ నిర్వహించారు. ఎంత వెతికినా ఎవరూ దొరకలేదు. చివరిగా బాత్‌రూమ్‌ని తనిఖీ చేయగా పోలీసులకు గురక శబ్ధం వినిపించింది. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా? అని పరిశీలించగా అందులోని ఓ చిన్న సీక్రెట్ గది బయటపడింది. ఆ గదిలో విటుడు, ఓ మహిళ ఉన్నట్లు గుర్తించారు. అలా హోటల్‌లో మూడు గదులు ఉన్నాయని తెలుసుకోని అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.