సికింద్రాబాద్ అగ్నిపథ్ ఆందోళనల్లో గాయపడిన 14 మందిలో 5గురు బుల్లెట్ గాయాలతో నిన్న గాంధీ ఆసుపత్రికి వచ్చారని సూపరిెంటెండెంట్ రాజారావు వెల్లడించారు. వారిలో ఒకరు చనిపోగా..మరో నలుగురికి సర్జరీ జరిగిందని చెప్పారు. ఒకరికి ఛాతిపై బుల్లెట్ తగలడంతో మేజర్ సర్జరీ చేశామని మరొకరికి తొడ భాగంలో శస్త్రచికిత్స చేశామని వెల్లడించారు. వీరిద్దరూ కోలుకోవడానికి సమయం పడుతుందని వివరించారు. మిగతా ఇద్దరూ త్వరగా కోలుకుంటారని చెప్పారు. మిగిలిన 9 మంది సాధారణ గాయాలతో వచ్చారని..వీరందరినీ అబ్జర్వేషన్లో ఉంచామని రాజారావు వెల్లడించారు.