సికింద్రాబాద్‌లోని డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ షోరూంలో అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే సబ్ స్టేషన్‌లో ట్రిప్ అయ్యేదని పేర్కొన్నారు. ఒక వేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే వైర్లు, మీటర్లు పూర్తిగా కాలిపోయేవని వెల్లడించారు. షోరూంలో మంటలు వ్యాపిస్తున్నప్పుడు కొద్ది దూరంలోనే విద్యుత్ ఉందని తెలిపారు. ఆ తర్వాతే విద్యుత్ సరఫరా ఆపివేశామన్నారు. కాగా షోరూం యజమాని జావేద్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.