సికింద్రాబాద్ డెక్కన్ స్పోర్ట్స్ వేర్ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు యువకులు సజీవ దహనమైనట్లు సమాచారం. డ్రోన్ కెమెరా విజువల్స్‌ను బట్టి వారి మృతదేహాలు బిల్డింగ్ వెనుక భాగాన ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా మంటలు వస్తూండటంతో లోపలికి వెళ్లటానికి వీలు కావడం లేదు. వేడి తగ్గిన తర్వాత భవనాన్ని నేలమట్టం చేయనున్నారు. కాగా ఘటనా స్థలాన్ని కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు. మృతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.