గుజరాత్లోని అమ్రెవాడిలో విస్తుపోయే సంఘటన వెలుగులోకి వచ్చింది. విలాసాలకు అలవాటు పడిన మహిళ అండాలు అమ్ముకోవడమే గాక.. ప్రశ్నించిన భర్తను కూడా చంపేస్తానంటూ బెదిరించింది. పోలీసుల వివరాల ప్రకారం నిందితురాలు అనితకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల ఆమె అండాలు అమ్ముకుంటున్నట్లు భర్త గుర్తించాడు. తన అనుమతితోనే విక్రయిస్తున్నట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు తెలుసుకున్నాడు. 2019 నుంచి 2022 జూన్ మధ్య పలుమార్లు ఆమె అండాలను విక్రయించుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.