పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం నమోదైంది. క్వెట్టాతో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 36 బంతుల్లోనే 100 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. తద్వారా పీఎస్ఎల్‌లో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉస్మాన్ చరిత్ర సృష్టించాడు. మొత్తంమీద 43 బంతుల్లో 12 ఫొర్లు, 9 సిక్సర్ల సాయంతో 120 పరుగులు బాదాడు. ఉస్మాన్ విధ్వంసం ధాటికి ముల్తాన్ జట్టు 3 వికెట్ల నష్టానికి 262 పరుగుల భారీ స్కోరు చేసింది.