శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 580-4 కు డిక్లేర్ చేసిన కివీస్.. బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. 164 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేసింది. నలుగురు లంక బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. కరుణ రత్నె ఒక్కడే 89 పరుగులు చేశారు. హేన్రీ 3, బ్రేస్‌వెల్ 3 వికెట్లతో అదరగొట్టారు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో విలియమ్సన్, నికోల్స్ ఇద్దరూ డబుల్ సెంచరీలు చేశారు.