బాలీవుడ్ మాజీ నటి, సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ బాలీవుడ్ స్టార్ హీరోను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో వివాదాస్పద పోస్ట్ పెట్టింది. ఓ నటుడిని ‘బాలీవుడ్ హార్వే వైన్‌స్టీన్’ అని సంభోదించింది. ‘బాలీవుడ్ హార్వే వైన్‌స్టీన్, నీ భాగోతం త్వరలోనే బయటకు వస్తుంది, నీ చేతిలో మోసపోయిన అమ్మాయిలందరూ ఒక్కొక్కరుగా బయటికొచ్చి నీ బండారం బయటపెట్టే రోజులు దగ్గర పడ్డాయి’ అంటూ పోస్ట్ చేసింది. దీంతో పాటు అతనిపై నిజాలను చెప్పేందుకు ముందుకు వచ్చిన ఐశ్వర్యరాయ్‌కు ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టడంతో అది వైరల్‌గా మారింది. ఆమె ఈ వ్యాఖ్యలను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను ఉద్దేశించే చేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. సోమీ అలీ పోస్ట్‌ను చూసేందుకు Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి.