పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అత్యాచారం కిందకి రాబోదని ఒరిస్సా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఓ సహజీవనం కేసుకు సంబంధించిన పిటిషన్ని విచారణ చేసి న్యాయస్థానం ఇలా తీర్పు ఇచ్చింది. పెళ్లి చేసుకుంటానని ఒప్పించి ఓ మహిళతో వ్యక్తి సహజీవనం చేశాడు. కొన్ని రోజులు గడిచాక ఆ వ్యక్తి పరారయ్యాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్టు చేశారు. బెయిల్ కోరుతూ నిందితుడు పిటిషన్ దాఖలు చేయగా జిల్లా కోర్టు నిరాకరించింది. అనంతరం హైకోర్టుకు వెళ్లగా.. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.