780 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

© File Photo

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఒక దశలో BSE సెన్సెక్స్ 780 పాయింట్లు, NSE నిఫ్టీ 247 పాయింట్లు పెరిగింది. దీంతో సెన్సె క్స్ 59,930 పాయింట్ల ఎగువన కొనసాగుతుండగా, నిఫ్టీ 17,870 పాయింట్ల ఎగువన ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా లాభాల్లోనే దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ జాబితాలో ఉన్నాయి.

Exit mobile version