దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు గరిష్టాలను చేరుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మొదటిసారిగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉన్నందున పలు సూచీలు పుంజుకున్నాయి. బ్యాంకులు, IT సంస్థల్లో కొనుగోళ్లు భారీగా జరిగాయి. దీంతో సెన్సెక్స్ 935.72 పాయింట్లు పెరిగి 56,486 వద్ద స్థిర పడగా, NSE నిఫ్టీ 240.85 పాయింట్లు వృద్ధి చెంది 16,871.30 వద్ద ముగిసింది. దీంతో మదుపర్ల సంపద రూ.13 లక్షల కోట్లకు పైగా పెరిగింది.