ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించడంతో డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా సీక్వెల్‌పై దృష్టి పెట్టినట్లు జక్కన్న వెల్లడించారు. ‘తొలుత ఈ సినిమా సీక్వెల్ తీయాలా? వద్దా? అని ఆలోచించాం. కానీ, ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ రావడంతో నాన్నతో చర్చించా. ఈ క్రమంలో ఓ ఆలోచన తట్టింది. దానిపై కథను సిద్ధం చేసే పనిలో పడ్డాం. అది పూర్తయ్యాకే సీక్వెల్‌పై ఒక ప్రకటన వెలువరించే అవకాశం ఉంటుంది’ అని రాజమౌళి చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.