హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఓ పుట్టినరోజు వేడుకల్లో పలువురు రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో తల్వార్లు పట్టుకుని చిందులేశారు. వేడుకల్లో పలువురు మహిళలచే అశ్లీల నృత్యాలు కూడా చేపించారు. పెద్ద శబ్దంతో డీజే సాంగ్స్ పెట్టి అరుపులు కేకలతో నానా రభస చేశారు. దీంతో ఆగ్రహం చెందిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఏడుగురిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.