రష్యా దాడుల్లో ఎల్వివ్‌లో ఏడుగురు మృతి

© Envato

ఉక్రెయిన్ పై రష్యా దాడులు తీవ్రతరం చేసింది. తాజాగా ఎల్వివ్‌ ప్రాంతంలో జరిపిన దాడుల్లో ఏడుగురు మృతి చెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షిపణులతో మిలటరీ స్థావరాలపై దాడి చేసినట్లు అక్కడి అధికారులు చెప్పారు. లోహన్స్క్, కీవ్ ప్రాంతాల్లో కూడా రష్యా సేనలు దాడులు జరిపాయి. అయితే రష్యా క్షిపణి క్రూయిజర్ మోస్క్వా కూల్చివేత తర్వాత రష్యా సేనలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ సైన్యం కూడా దీటుగా ఎదుర్కొంటున్నట్లు చెబుతోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 20వేలకుపైగా రష్యా సైనికులను మట్టుబెట్టనట్లు చెబుతోంది.

Exit mobile version