శృంగారానికి పెళ్లి లైసెన్స్ కాదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. వైవాహిక అత్యాచారం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో కోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. భార్యల సమ్మతి లేకుండా శృంగారానికి పాల్పడడం నేరంగా పరిగణించనప్పటికీ, ఆ చర్యలు భార్యల మానసిక, శారీరక గాయాలకు కారణమవుతాయని పేర్కొంది. ఈ విషయంలో భర్తలు వారి భార్యల అభిప్రాయాన్ని గౌరవించాలని కోర్టు కోరింది.