రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు చరణ్ సింగ్ సహా కోచ్లు రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారంటూ వినేశ్ ఫొగాట్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమెకు మద్దతుగా దాదాపు 200 మంది రెజ్లర్లు దిల్లీలో ధర్నాకు దిగారు. దీనిపై స్పందించిన చరణ్ సింగ్ అవన్నీ అవాస్తవవాలని పేర్కొన్నారు. నిరూపిస్తే ఆత్మహత్యకు సిద్ధమని ప్రకటించారు. దీనికి సంబంధించి 72 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని WFIని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంతో జాతీయ మహిళల రెజ్లింగ్ శిక్షణా శిబిరం రద్దయ్యింది.