హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్‌పై లైంగిక వేదింపుల కేసు నమోదైంది. హర్యానా మహిళా అథ్లెటిక్స్ కోచ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్ సింగ్ తనకు జిమ్‌లో తొలుత పరిచయం అయ్యారని మహిళా కోచ్ తెలిపింది. ఆ తర్వాత ఇన్‌స్టాలో చాట్ చేస్తూ తనను కలుసుకోవాలని ఒత్తిడి చేశాడని పేర్కొంది. తన నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్ పెండింగ్‌లో ఉందని కలవాలని చెప్పారు. డాక్యుమెంట్లతో మంత్రి దగ్గరకు వెళ్తే లైంగిక వేదింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. ఈ ఘటనపై మంత్రి స్పందిస్తూ కోచ్ ఆరోపణలు నిరాధారమైనవని ఖండించారు.