విమానాల్లో ఈ మధ్య తరచూ వివాదాస్పద ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఇండిగో విమానంలో మరో ఘటన చోటు చేసుకుంది. తప్పతాగి ఎయిర్‌హోస్టస్‌పై లేంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆదివారం రాత్రి దిల్లీ నుంచి పాట్నా వెళ్తున్న ఇండిగో విమానంలో ముగ్గురు ప్రయాణికులు రచ్చరచ్చ చేశారు. మద్యం మత్తులో ఎయిర్హోస్టస్ని వేధించారు. అంతేగాకుండా అడ్డొచ్చిన కెప్టెన్‌పై దాడి చేశారు. దీంతో పట్నాలో విమానం ల్యాండ్ కాగానే.. సీఐఎస్ఎఫ్ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారయ్యాడు. నిందితులంతా తేజస్వీ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ పార్టీకి చెందినవారుగా తెలుస్తోంది.