• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘పఠాన్‌’ బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై షారుఖ్‌ ఖాన్ స్పందన

    ‘పఠాన్‌’ బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై షారుఖ్‌ ఖాన్ తొలిసారి స్పందించారు. “మన సమాజం ఎలా నడుచుకోవాలో ఇప్పుడు సోషల్‌ మీడియా నిర్ణయిస్తోంది. సినిమాపై సోషల్‌ మీడియా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందనేకంటే, ఈ సమాజంలో సినిమా ఇప్పుడు మరింత కీలక పాత్ర పోషిస్తుందని నేను నమ్ముతున్నా. ఒక సంకుచిత ఆలోచనా ధోరణితో సోషల్‌ మీడియా నడుస్తోంది. ఇది మానవ స్వభావాన్ని నీచానికి దిగజారుస్తోంది. నెగెటివిటీ అనేది సోషల్‌ మీడియా వినియోగాన్ని తద్వారా వారికి మార్కెట్‌ విలువను పెంచుతుందని ఇటీవల ఎక్కడో చదివాను. ఇది విధ్వంసానికే దారి తీస్తుంది. అందరం పాజిటివిటీని ప్రచారం చేయాలి” అంటూ షారుఖ్‌ వ్యాఖ్యలు చేశారు.