• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అత్యంత ఖరీదైన ఆటగాడికి అవమానం

    ఐపీఎల్ చరిత్రలో రూ.18.5కోట్లు పలికి అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డుకెక్కిన సామ్ కర్రన్‌కి చేదు అనుభవం ఎదురైంది. ఓ చిన్న కారణంగా ఈ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ని విమానంలోకి అనుమతించలేదు. వర్జిన్ అట్లాంటిక్‌కి చెందిన ఫ్లైట్‌లో సామ్ కర్రన్‌కి కేటాయించిన సీటు విరిగిపోవడమే ఇందుకు కారణమట. ఈ విషయాన్ని ట్విటర్‌లో తెలియజేస్తూ షాక్‌కి గురయ్యా అంటూ కర్రన్ వాపోయాడు. ‘సీటు విరిగిందని చెప్పి నన్ను విమానం ఎక్కనీయలేదు. నిజంగా క్రేజీగా ఉంది కదూ. ఈ నిర్ణయం ఇబ్బంది కలిగించడమే కాక షాక్‌కి గురిచేసింది’ అని కర్రన్ ట్వీట్ చేశాడు. దీనికి ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెబుతూ అక్కడే చెప్పి ఉంటే వేరే సీటును ఏర్పాటు చేసేవారమని తెలిపింది.