• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మా గురించి మాట్లాడటానికి సిగ్గు లేదా: చైనా

    జీ7 దేశాలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడటానికి సిగ్గు లేదా అని విమర్శించింది. చైనాకి వ్యతిరేకంగా జీ7 దేశాలు హీరోషిమా వేదికగా సంయుక్త ప్రకటన చేశాయి. తైవాన్, హాంగ్‌కాంగ్‌ ప్రాదేశిక ప్రాంతాలపై ఆక్రమణ ధోరణి, దక్షిణ, తూర్పు హిందూ మహాసముద్రంలో దుందుడుకు చర్యలని నిరసిస్తూ ప్రజాస్వామ్య దేశాలు గళం విప్పాయి. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనపైనా పెదవి విరిచాయి. జింజియాంగ్ ప్రావిన్సులో ఉయ్‌గర్ ముస్లింల అణచివేతను ముఖ్యంగా ప్రస్తావించాయి. అయినప్పటికీ, చైనాతో నిర్మాణాత్మక సంబంధాలు ఏర్పరుచుకోవాలని చూస్తున్నట్లు తెలిపాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv