శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బెస్ట్ స్కైట్రాక్స్ అవార్డు దక్కింది. ప్రపంచంలోనే అత్యుత్తమ 100 ఎయిర్ పోర్టుల్లో 64 నుంచి ఒకస్థానం మెరుగుపర్చుకుని 63కు చేరుకుంది. అలాగే ఆసియాలోనే అత్యుత్తమ సిబ్బంది కలిగిన విమానాశ్రయంగా శంషాబాద్ విమానాశ్రయానికి గుర్తింపు దక్కిందని GMR ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్టు ఇన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా-2022లో రెండవస్థానం, క్లీనెస్ట్ ఎయిర్‌పోర్టు ఇన్ ఇండియా అండ్ సౌత్ ఆసియాలో 4వ స్థానం అవార్డులను జీఎంఆర్ అందుకుందని తెలిపారు.