ఆస్ట్రేలియా ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ (52) హఠాన్మరణం చెందారు. థాయిలాండ్ లోని తన విల్లాలో విగతజీవిగా పడి ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దారిలోనే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాదాపు 15సం.లు ఆస్ట్రేలియా క్రికెట్ కు సేవలందించిన వార్న్ 145 టెస్టుల్లో 708వికెట్లు తీసిన ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నారు. 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. ఇక, ఈ వార్త తెలిసి క్రీడా లోకం నివ్వెరపోయింది.