ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్ మార్చి 4న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం క్రికెట్ ప్రేమికుల్ని షాక్‌కు గురిచేసింది. అయితే పోస్టుమార్టం రిపోర్టులో కూడా ఆయనది సహజమరణమే అని తేలింది. అయితే ఆయన అంతకుముందు 14 రోజులుగా కేవలం లిక్విడ్ డైట్ చేయడం వలనే అలా జరిగిందని వార్తలు వస్తున్నాయి. త్వరగా బరువు తగ్గాలనే లక్ష్యంతో ఎటువంటి ఆహరం తీసుకోకుండా కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకున్నాడట. మరణానికి ముందు రోజు వార్న్ చేసిన ట్వీట్ కూడా ఇందుకు రుజువు అని చెప్తున్నారు. మళ్లీ పాత షేప్‌లోకి వచ్చేస్తానంటూ ఆయన ట్వీట్ చేశాడు. లిక్విడ్ డైట్ చేస్తే శరీరానికి కేలరీలు అందవు. శరీరం ఎక్కువగా కొవ్వును పీల్చుకుంటుంది. దీంతో బరువు తగ్గుతారు. గత కొన్నేళ్లుగా అధిక బరువుతో వార్న్ బాధపడ్డట్లు తెలుస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడట. అయితే ఈ డైట్ 5 రోజుల కంటే ఎక్కువ చేయకూడదని డాక్టర్లు చెప్తున్నారు. అదేవిధంగా షేన్ వార్న్ కేవలం దీనివలనే కాదు, అతడికి ఉన్న స్మోకింగ్ అలవాటు వలన కూడా హార్ట్ ఎటాక్ వచ్చి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం