సోషల్ మీడియా స్టార్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన యాక్టింగ్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న షన్ను ఓ మంచి డ్యాన్సర్ కూడా. అయితే ఈ మధ్య కాలంలో ఎంతో వైరల్ అయిన అరబిక్ కుతు పాటకు షన్ను తన స్నేహితురాలితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఆ డ్యాన్స్ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. కొత్త కొత్త స్టెప్స్‌తో అతను చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. దీంతో అతని ఫ్యాన్స్, నెటిజన్లు ఆ డ్యాన్స్ వీడియోను తెగ లైక్స్, షేర్స్ చేస్తున్నారు.