తెలంగాణ కొత్త సీఎస్‌గా IAS అధికారి శాంతకుమారి నియామకం అయ్యారు. కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న సోమేష్ కుమార్‌ను ఏపీ క్యాడర్‌కు బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం సైతం ఆయన్ను రిలీవ్ చేస్తూ ఏపీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పుపై సోమేష్ కుమార్ అప్పీల్‌కు వెళ్లనున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన్ను కేంద్రం ఏపీ క్యాడర్‌కు కేటాయించింది.