రాష్ట్రపతి ఎన్నికల తేదీ దగ్గర పడుతుండగా, బలమైన ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రతిపక్ష శిబిరం సిద్ధమైంది. అందులో భాగంగానే ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించేందుకు ప్రతిపక్షాలు సిద్దమయ్యాయట. కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ కూడా దీనికి ఓకే చెప్పిందని, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, DMK, AAP పార్టీలన్నీ కూడా శరద్ పవార్ ఉమ్మడి అభ్యర్థిగా ఉండడానికి సానుకూలంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని వెతికే పనిలో ఉన్న రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే త్వరలో ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉంది.