ఆ నిర్ణయానికి షిండే కూడా షాకయ్యారేమో: శరద్ పవార్

© ANI Photo

శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతటి పదవి వస్తుందని షిండే కూడా ఊహించకపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవితో ఫడ్నవీస్ సంతృప్తిగా లేరనే విషయం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందని శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్రలో శివసేన పని అయిపోయిందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఇలాంటి ఎన్నో ఆటు పోట్లను శివసేన ఎదుర్కొందని శరద్ పవార్ పేర్కొన్నారు.

Exit mobile version