మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఎన్నికల్లో YSRTP అధినేత్రి షర్మిల, BSP రాష్ట్ర కన్వీనర్ RS ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న ఈ నేతలు.. మునుగోడు ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఎన్నికలను అధికార TRS, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో వ్యూహాలు రచిస్తున్నాయి. మరి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.
-
Courtesy Twitter:
-
Courtesy Twitter: