ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న మూవీ టైటిల్ జవాన్‌గా ప్రకటించారు. పాన్ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని నేడు లాంచ్ చేశారు. జూన్ 2, 2023న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలిపారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.