టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ అమ్మాయిని శర్వా వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అమెరికాలో సెటిల్ అయిన ఆ సాఫ్ట్వేర్ యువతితో శర్వా లవ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా విజయవాడలోని ఒక ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన శర్వానంద్ రెండు దశాబ్దాలుగా ‘సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం అతడు.. క్రిష్ణ చైతన్య డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు.