మీరెప్పుడైనా ట్రైన్లలో టీ తాగారా. రేటు ఎంత ఉంటుంది. మహా అయితే రూ.10 నుంచి 20 వరకు ఉంటుంది. కానీ ఓ ప్రయాణికుడికి ఏకంగా రూ.70 బిల్లు వేశారు. అవాక్కైన అతడు ఆ టీకు సంబంధించి బిల్ కావాలని కోరాడు. దీంతో వారిచ్చిన బిల్లు చూసి మళ్లీ ఆశ్చర్యానికి గురయ్యాడు. బిల్లులో టీ రేటు రూ.20 ఉండగా, సర్వీస్ ఛార్జ్ రూ.50గా ఉంది. అయితే అతను శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లో జూన్ 28న ప్రయాణించాడు. అందులో టీ, కాఫీ ఏది తీసుకున్నా అంతే సర్వీస్ చార్జ్ ఉంటుందని IRCTC ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆ బిల్లును సోషల్ మీడియాలో పోస్ట్ చేయండంతో ప్రస్తుతం వైరల్ గా మారింది.