బ్రేకప్ చెప్పట్లేదని ప్రియుడిని ప్రియురాలు హత్య చేసిన విచిత్ర ఘటన కేరళలో వెలుగుచూసింది. తిరువనంతపురానికి చెందిన షారోన్ అనే యువకుడు, యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరిలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇదే సమయంలో యువతికి వేరొకరితో నిశ్చితార్ధం జరిగింది. దీంతో తనను వదిలేయాలంటూ యువతి అతడిని కోరగా అతడు నిరాకరిస్తూ వచ్చాడు. విసుగెత్తిన యువతి అతడిని చంపేందుకు కుట్ర పన్నింది. అక్టోబరు 14న అతన్ని ఇంటికి పిలిచి.. ఆయుర్వేద కషాయంలో పురుగుల మందు కలిపి ఇచ్చింది. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆ యువకుడు చికిత్స పొందుతూ అక్టోబర్ 25న మృతిచెందాడు.
బ్రేకప్ చెప్పట్లేదని ప్రియుడిని చంపేసింది!

© Envato(representational)