సర్కస్ సినిమా గురించి హీరోయిన్ పూజా హెగ్డే ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సినిమా కథ, హీరో వివరాలు అడగకుండానే రోహిత్ శెట్టి దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పేసిందట. “ రోహిత్ శెట్టి దర్శకత్వంలో పనిచేయాలనేది నా డ్రీమ్. సర్కస్ మూవీ డేట్ల కోసం ఆయన నాకు స్వయంగా కాల్ చేశారు. డేట్స్ లేకున్నా అడ్జస్ట్ చేస్తాను అని చెప్పాను. ఆ తర్వాత హీరో రణ్వీర్ సింగ్ అని చెప్పారు” అని చెప్పింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కథ వినకుంటే ఇలానే అవుతుందని కామెంట్లు వస్తున్నాయి.