తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఈ క్రమంలోనే షీ ట్యాక్సీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే పథకంలో అమలులో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాక్సీలు నడపాలనుకునే మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం శిబిరాన్ని ఏర్పాటు చేసింది. కూకట్ పల్లిలోని అల్వీన్ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ శిబిరాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. కాగా మహిళలకే కాకుండా థర్డ్ జెండర్ వాళ్లకు కూడా ఈ శిబిరంలో శిక్షణ అందివ్వనున్నారు.